ప్రపంచము ముందుకు సాగిపోవుచున్నది. రోజురోజునకు ప్రపంచముంలో యెన్నియో మార్పులు కలుగుచున్నవి. దాని ననుసరించి మన దేశము నడచినను మన వాస్తు శాస్త్రము మాత్రము యింకను వెనుకబడియే యున్నది. దీనికి కారణము మనము ఉన్న దానితోనే సంతోషపడుట. క్రొత్త సంగతులను కనిపెట్టుటకు పూనుకొనకపోవుట. మన పండిత ప్రకాండులైన వారిలో బహుళ సంఖ్యాకుల చూపు వెనకేగాని ముందుకు గాదు. వారు జీవిత వాహినీ తీరంపైన నడయాడెదరేగాని ప్రవాహములోనికి దూకరు. దున్నిన చాలునే మరొకసారి దున్నెదరుగాని కొత్తచాలు వేయలేరు. పండిన పంటలో తాలుకాయ, తప్పకాయ తూర్పారబెట్టగలరేగాని కొత్తపంట పండించలేరు. ఏదో ఒక కారణం వల్ల అందరము ఈ వలలో చిక్కుకున్నాము. మనకు ఇష్టంలేకపోయినా కొన్ని పనులు చేయవలసి వచ్చుచున్నది. అయితే ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా, సంఘపరంగా, అన్ని జాతులవారితో సహా తాము తప్పు అనుకున్న దానిని యెదిరించి పోరాడ వలెననియు, విధి విలాసమునకు లొంగి పోరాదనియును మన సంకల్పమై యుండవలెను. అట్టి పూనికతోడనే మూలమును గ్రహించి అనుభవముగా నీ శాస్త్రము వ్రాయబడినది. మన దేశములోగల వాస్తు పండితులు, సిద్ధాంతులు అందరూ గ్రహించవలసిన దేమనగా ఆయా ప్రాంతాలలోని వారందరూ నీ శాస్త్ర విషయములను చర్చించి అనుభవమును గుర్తించి తగు విధముగా ప్రచారములోనికి తీసుకొని వచ్చుట యెంతైనా అవసరమై యున్నది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good