(తేట తెలుగు వచనము - హరి వంశము సహితము)
మహాభారత ఇతిహాసము జాజ్వల్యమానమైన వెలిగే దీపం. ఇది మోహాంధకారాన్ని దూరం చేస్తుంది. మానవుల అంత:కరణములను పునీతం చేస్తుంది. జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది. అంత:కరణములను వెలుగుతో నింపుతుంది.
శ్రీ మహాభారతము మహాగ్రంథం. అపూర్వ ఇతిహాసం, మానవజాతికి మహావరప్రసాదం. మహాభారతం సమస్త మానవజాతి కథ.  అది భారతదేశంలో చెప్పబడింది కాబట్టి మహాభారతం అయినది. వ్యాస మహర్షిచే మహాభారతము రచింపబడినది.
అన్నమును ఆశ్రయించక శరీరమును నిలుపుట అసాధ్యము. మహాభారత కథను ఆశ్రయించక లోకమున కథ ఉండుట అసాధ్యము. అన్నంలేక మనిషి బ్రతకలేడు. మహాభారతపు కళ లేక లోకంలో కథ ఉండటానికి వీల్లేదు. ఇది అక్షర సత్యం. మానవజాతి చరిత్రను, మానవ మనస్తత్వాన్ని, మానవధర్మాలను, నీతులను, నిబంధనలను సంపూర్ణంఆ వివరించింది మహాభారతం. మిగిలిందేమీ లేదు. ఎవరు రచించినా వ్యాసుని ఎంగిలి మాత్రమే అని గ్రహించాలి.
మహాభారతం మనలో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆహ్లాదం నింపుతుంది. ఆత్మోన్నతి కలిగిస్తుంది. మనసును పులకింప చేస్తుంది. కన్నుల నీరు నింపుతుంది. మహాజ్యోతిని ముందు నిలుపుతుంది. మహోన్నతికి తీసుకుపోతుంది. పరమపదం చేతికి అందిస్తుంది.
మానవజాతిని ఉద్ధరించడానికి వ్యాసమహర్షి పడిన శ్రమ, తపన, ఆర్తీ, ఆవేశం, ఆవేదన శ్రీ మహాభారతంలో ప్రతి అక్షరంలో కనిపిస్తుంది. అందుకే వ్యాసునకు నమస్కరిద్ధాం.
వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే: పౌత్రమ కల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధి
ఆదికవి నన్నయ ఆంధ్ర మహాభారతం అరణ్యపర్వంలో కొంతమేరకే వ్రాయగలిగారు. మహాభారతం పూర్తిచేయ తలపెట్టిన తిక్కన సోమయాజి నన్నయభట్టు వదిలిన అరణ్యపర్వ శేషాన్ని అంటుకోలేదు. విరాటపర్వం నుంచి మొదలుపెట్టి పూర్తి చేశారు. ఎఱ్ఱన అరణ్యపర్వ శేషమూ - ఖిలపర్వంగా హరివంశము పూర్తి చేశారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good