వైష్ణువులకు ప్రీతికరమైన వివిధ దేవాలయాల సేకరణ "సుప్రసిద్ధ విష్ణ్వాలయాలు" నందు పొండుపరుచట జరిగింది. దశావతరములు నవజనార్ధన క్షేత్రాలు, పంచభావనారాయణ క్షేత్రాలు, పంచ లక్ష్మినారాయణ క్షేత్రాలు, పంచ నృసింహక్షేత్రాలు, స్వయంభూ వైష్ణవ క్షేత్రాలు, దివ్యక్షేత్రాలు, దివ్యదేశములు, దివ్యధామాలుతోపాటు అరుదైన ధన్వంతరి, హయగ్రీవ, జగన్మోహినీ మొదలగు 107 వైష్ణవ ఆలయాల సమాచారమును పొందగలరు. యాత్రను సులభముగా చేయుటకు కావలసిన రైలు మరియు రోడ్డు పటములు కూడా జతచేయుట జరిగింది. స్వతంత్రముగాను మరియు సౌఖ్యముగాను యాత్ర చేయుటకు కావలసినంత సమాచారం మీకు లభించగలదు.--- కె.కె. మంగపతి |