భారతీయ వేదాంత సారం విష్ణుసహస్రనామములోను, భగవద్గీతలోను రూపుదిద్దుకుంది. సహస్రనామాలలో పరమాత్మ తత్వాన్ని, భగవంతుని గుణాలను వర్ణించే దివ్యనామాలతోను వివరించడం జరిగింది. విష్ను సహస్రనామాలను తలచుకున్నంత మాత్రాన్నే మనసు పావనమవుతుంది. సహస్రనామాలలోని ప్రతి అక్షరంలోను భగవంతున్ని దర్శించవచ్చు.
సహస్రనామం ఎప్పుడైనా పఠించవచ్చు. కమలనయనుని స్మరణమాత్రాన సమస్త దు:ఖములు తొలగిపోతాయి. భగవన్నామము తలచినంతనే మన హృదయం శాంతపడుతుంది. నారాయణ దివ్యనామ ప్రభావమును అనుభవిస్తూ, ఇతరులకు అందించడానికి నారదమమాముని, త్రిలోక సంచారి అయ్యాడేమో? పరమ పవిత్రుని నామాన్ని స్మరించటమే కాక, నామాలను అవగాహన చేసుకుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ ఆనందాన్ని కీర్తనలుగా కూర్చి, స్వామి మెడలో వేయాలని నాకు ఆలోచన కలిగింది. ప్రతి నామానికి ఒక కీర్తన వ్రాయాలనే ఈ ప్రయత్నం. ప్రస్తుతం మొదటి 15 శ్లోకాలలోని నామాలకు, చివరి 2 శ్లోకాలలోని నామాలకు, వరుస క్రమములో కాక 28 నామాలకు మొత్తం 184 నామాలకు కీర్తనయలు వ్రాశాను.- డి.విజయలక్ష్మి
పేజీలు : 81