ప్రవృత్తి - నివృత్తి వేదాలు ప్రవృత్తి, నివృత్తియని రెండు మార్గాలు చూపించాయి. ప్రపంచ వ్యవహారాలను ధార్మికంగా నిర్వహించడం ప్రవృత్తిమార్గం. ప్రాపంచిక వ్యవహారానికి దూరంగా ఉండి జనన మరణ ప్రవాహం నుండి విముక్తుడగుట, పరమాత్మతో ఐక్యమగుట నివృత్తిమార్గం. ప్రవృత్తిమార్గం, వేదచోదిత ధర్మంపై ఆధారపడి వర్ణాశ్రమాలతో ఉండి తన శ్రేయస్సునకు, సంఘ శ్రేయస్సునకు తోడ్పడే రీతితో ఉంటుంది. పుణ్య కర్మ ఫలం క్షీణించగా మరల జన్మనెత్తుట జరుగుతుంది. అంటే స్వర్గ సౌఖ్యము శాశ్వతము కాదని తేలినట్టే గదా! లోకంలో గాని, స్వర్గంలో కాని శాశ్వత సుఖం అంటూ లేదు. ఇక్కడా, అక్కడా భయం, దు:ఖం, క్రోధం మామూలే! కన్ను, చెవులు మొదలైన ఇంద్రియాల వల్ల కొంత సౌఖ్యం అనుభవించే మాట నిజమే. కాని లోనున్న ఆత్మకు ఇవి సంతోషాన్ని ప్రసాదిస్తాయా? ఆత్మతృప్తి కల్గుతుందా? 

Pages : 230

Write a review

Note: HTML is not translated!
Bad           Good