అనాదిగా లభించిన సంప్రదాయకమైన వారసత్వాన్ని, ఇక్కడ వెలసిన ఋషి, మునిపరంపరలను గర్వించదగినదిగా భావంచే ఈ దేశపు వినీలాకాశంలో వెలుగొందుతున్న వింతైన తారల్లో శ్రీరమణ మహర్షి ఒకరు.
ఒక చిన్న బాలుడిగా ఆత్మసాక్షాత్కారాన్ని అన్వేషిస్తూ, తమిళనాడులోని తిరువణ్ణామలై చేరిన రమణ మహర్షి తమ దేహాంతం వరకు నిరంతరంగా పవిత్రమైన అరుణాచలం, దాని దరిదాపుల్లోనే 54 ఏళ్ళపాటు జీవించారు. వారు చాలామటుకు మౌనాన్ని పాటించినప్పటికీ, ఆ మౌనమే వాగ్ధాటి అయింది, దూర దూరాల నుండి సాధకులను ఆకర్షించింది. ఎందరో ఆయనను దక్షిణామూర్తి రూపంలోని శివుడిగా భావించారు. మహర్షి సందేశం మన పురాతన గ్రంథాలలోని ఉపదేశ సారము. సంక్షేపం కూడా.
కాలక్రమేణ, వారి జీవిత చరిత్ర, తాత్వితలను ఆధారంగా చేసుకుని రమణ సాహిత్యం అభివృద్ధి చెందింది, చెందుతోంది కూడా. ''శ్రీ రమణ మహర్షితో ముఖాముఖి'' అన్న ఈ పుస్తకం ఈ రెండు కోవలకు చెందుతుంది. ఇందులో మహర్షి దర్శన భాగ్యం పొందినవారి ప్రత్యక్ష కథనాలు, మహర్షి సమక్షం వారిపై చూపిన ఉత్తేజ పూరితమైన ప్రబావం చోటు చేసుకున్నాయి. వారి రచనల నుండి ఎన్నుకోబడిన భాగాలు తమ ఆధ్యాత్మిక సాధనామార్గాన్ని మహర్షి ఎలా తేజోవంతం చేశారో వివరిస్తున్నాయి.
ఆంగ్లమూల సంకలనం : ప్రొ||లక్ష్మీనారాయణ్‌
తెలుగు అనువాదం : పింగళి సూర్యసుందరం

Write a review

Note: HTML is not translated!
Bad           Good