రామకథను ఎన్ని పర్యాయాలు చదివినా మనకు కొత్త సందేహాలు జనిస్తాయి. రామాయణ ఇతివృత్తాన్ని అందలి పాత్రలను మనం బాగా అవగాహన చేసుకోవాలంటే ప్రశ్నోత్తరాల పద్ధతి ఎంతగానో ఉపకరిస్తుంది. మిత్రులు నందిపాటి శివరామకృష్ణయ్య గారు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మనందరికీ ఎంతో మేలు చేశారు. కొద్దిమాసాల క్రితం వారు ''ప్రశ్నోత్తర మహాభారతం'' అనే చక్కటి గ్రంథాన్ని తెలుగు పాఠకుల కందించారు. విద్యార్థులకు, సాహితీప్రియులకు ఈ గ్రంథాలు మిక్కిలి ఉపయోగకరం. సందేహ నివృత్తి క్షణాల మీద జరుగుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good