భారతదేశంలో దాదాపు ముప్పై అయిదు ప్రధాన స్మృతులున్నాయి. వీటిల్లో మనుస్మృతి అగ్రగణ్యం. దీని తర్వాతనే యాజ్ఞవల్క్యస్మృతి మొదలయినవి లెక్కలోకి వస్తాయి. మనుస్మృతి అనగానే మనువు రచించిన స్మృతి అని సాహిత్యవరున కెవరికయినా అర్ధమవుతుంది. అయితే ఈ మనువెవ్వరో నిర్ణయించటం దుస్సాధ్యము. ఋగ్వేదములో పితృమనువు ప్రస్తావన ఉన్నది. శతపథ బ్రాహ్మణంలోని జలప్రళయ కథలో మనువు కనబడతాడు. పురాణాల ప్రకారం పద్నాలుగురు మనువులు గోచరిస్తారు. వీరిలో మొదటివాడు బ్రహ్మపుత్రుడైన స్వాయంభువ మనువు. ఇతని సంతతివారే మానవులు. అమరకోశం కూడా మనువు వలన పుట్టినవారు మానవులనీ (మనోర్జాతా మనుజా:) మనువు సంబంధమయిన వారు మానవులనీ (మనోరిమే మానవా:)పేర్కొంటుంది. అయితే రామాయణం మాత్రం కశ్యప ప్రజాపతికి ఎనిమిది మంది భార్యలున్నారనీ, వారివల్ల మానవునితోపాటు సమస్త ప్రాణులూ జన్మించాయని (అరణ్యకాండ, 14 సర్గం) చెప్తున్నది. కశ్యప ప్రజాపతి భార్యల్లో మనువు ఒకతె. ఆమె బ్రాహ్మణాది వర్ణములతో కూడిన మనుష్యులను కన్నది (శ్లో 29),..

Write a review

Note: HTML is not translated!
Bad           Good