నువ్వు విశ్వాన్ని సేవించు...విశ్వం నిన్ను సేవిస్తుంది...
ఇది నిజంగా జరిగిన సంఘటన...
స్కాట్లాండ్‌లో అతనో పేద రైతు.  పేరు ఫ్లెమింగ్‌...ఓ రోజు ఆపదలో చిక్కుకున్న ఒక శ్రీమంతుల అబ్బాయిని ఫ్లెమింగ్‌ రక్షించాడు. అందుకు అబ్బాయి తండ్రి కృతజ్ఞతలు తెలియజేశాడు.  ప్రతిఫలంగా ఫ్లెమింగ్‌కు పెద్ద బహుమతినివ్వబోయాడు  ఫ్లెమింగ్‌ సున్నితంగా తిరస్కరించాడు. 'మానవత్వంతో సాటి మనిషిని రక్షించానే తప్ప బహుఎమతల కోసం కాదు'' అన్నాడు.  ఆ సమయంలో ఫ్లెమింగ్‌ పక్కనే ఉన్న తని కొడుకును శ్రీమంతుడు చూశాడు.  ఆ కుర్రాడికి విద్యాబుద్దులు నేర్పించే బాధ్యతను స్వీకరించాడు. ఆ విధంగా పేద రైతుకొడుకు శ్రీమంతుడి సంరక్షణలో విద్యావంతుడయ్యాడు.  ప్రపంచానికి మేలు చేసే 'పెన్సిలిన్‌' అనే గొప్ప ఔషధాన్ని కనుగొన్నాడు.  అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ పేరుతో విశ్వవిఖ్యాతిని గడించాడు.
సంవత్సరాలు గడిచాయి.  అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ను చదివించిన శ్రీమంతుడి కుమారుడికి 'న్యుమోనియా' వ్యాధి సోకింది.  అప్పుడు అతణ్ని రక్షించింది ఎవరో తెలుసా?  పెన్సిలిన్‌ ఔషధం! అవును.. అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌ను చదివించిన ఆ శ్రీమంతుడి పేరు లార్డ్‌ రాండాల్ఫ్‌ చర్చిల్‌. న్యుమోనియా నుంచి బయటపడ్డ అతని కొడుకు పేరు సర్‌ విన్‌స్టన్‌ చర్చిల్‌... ఒకప్పటి బ్రిటన్‌ ప్రధాన మంత్రి...
అందుకే నేను ఎప్పుడూ చెబుతుంటాను...
'ఇక్కడ మనం సంతోషంగా ఉండకపోతే...ఎక్కడా సంతోషంగా ఉండలేం''.  ఈ పుస్తకం నా సంతోష పూర్వక సమర్పణ...దీన్ని మామూలుగా చదివితే ఇందులోని సంగతులు సాధారణమనిపిస్తాయి.  మనసు పెట్టి చదివితే లోతులు తెలుస్తాయి.  ప్రగాఢంగా చదివితే - ఇందులోని ఉదాహరణలు మిమ్మల్ని కదిలిస్తాయి.  మీకు స్ఫూర్తినిస్తాయి.  మీరు చీకట్లో చిక్కుకున్నప్పుడు దారిచూపే కరదీపికలవుతాయి.  - స్వామి సుఖబోధానంద

Write a review

Note: HTML is not translated!
Bad           Good