మహాభారత చరిత్రము
భారతీయ వాజ్మయమునందు స్మరణ, దర్శన, లేఖన, పఠన, పాఠనాదులచే బురుషార్థము నర్థుల కొసంగునది మహాభారతమని యార్యులు నుడువుదురు. రామాయణ మహాభారతగాథ ''లాసేతు హిమాచలుమ'' పెక్కు విధముల నాబాలగోపాలము గానముచేయదగిన సర్వ రససంపత్తిగలవై యున్నవి. పాశ్చాత్యులుగూడ రామాయణ మహాభారతముల దమతమ భాషలలోని కనువదించుకొనుటయు, మహాభారతమున నాగరికులుగా దలపబడు 'మలయ ద్వీపగణవాసులు'' కూడ దమ భాషలలో నొకటియగు ''కవి'' భాషలోని కనువదించుకొనుటయు జూడ రామాయణ, మహాభారతముల ప్రాశస్త్యము జగద్విదితమని స్పష్టమగుచున్నది.
రామాయణ, మహాభారతములు వీరులయొక్కయు, వీరవనితలయొక్కయు, దుర్మార్గుల యొక్కయు, సత్పురుషులయొక్కయు, బతివ్రతలయొక్కయు, జరిత్రలతో గూర్పబడుటచేతను, నాయికానాయకుల చరిత్రములు దేవమహిమలతో గూర్పబడి, వారలు సత్యముకొఋకు గష్టపరంపరలనొంది తుదకు మహాయుద్ధములలో జయము నొందినట్లు వర్ణింపబడుటచేత నవి నానాజాతులవారికి నింపగు ''నితివృత్తములు' కలవై యున్నవి....
పేజీలు : 237