భజగోవిందంలో భక్తిని, వైరాగ్యాన్ని సమానంగా శంకరాచార్యులు బోధించారు. కాలం మీరాక మనిషిని గోవిందుడు నామం తప్ప ధనం, అధికారం, పాండిత్యం, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఏవీ రక్షించలేవని, గోవింద (భగవంతుని) స్మరణ ఒక్కటే ఊరటని ఇస్తుందని వారు ఇందులో సున్నితంగా చెప్పారు. ఉపనిషత్తుల్లో వివరించిన వేదాంత సారం మొత్తం ఈ శ్లోకాల్లో ఇమిడి వుంది. వేదాంతం బోధించినా ప్రతీ శ్లోకం చివర్లో 'భజగోవిదం' అని చెప్తూండడంతో భక్తి ఎంత ప్రాముఖ్యమైనదో చెప్పకనే చెప్పినట్లయింది. మన జీవితాలలోని అనేక లోపాలను ఎత్తిచూపుతూ, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో భజగోవిందంలో భోధిస్తున్నారు. భక్తి వల్ల మనకి పుణ్యం, తద్వారా సుఖాలు రావచ్చేమో కాని, జ్ఞాన వైరాగ్యాలు లేనిదే ఎవరూ ముక్తివైపు సాగలేరు అన్న సందేశాన్ని ఇది ఇస్తుంది. ఈ జ్ఞాన దీపికను లోకానికందించిన శంకరులకి నమస్కరించి ఒక భజగోవిందంలోకి ప్రవేశిద్ధాం. దాని మీద శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు రాసిన వివరణని ఆస్వాదిద్ధాం. |