భగవద్గీత అనేది అనుభవ గ్రంథము. ఇది సాక్షాత్తు భగవంతుని ముఖము నుండి వెలుబడిన పలుకులు. ఇది ప్రజలనందరిని వారివారి సర్వస్వమును త్యజించి భగవంతుని పాదపద్మము శాశ్రయింపుండని బోధిస్తుంది. గీతలోని బోధనల ననుసరించినచో జీవితం ప్రశాంతంగా నడచి, మోక్షము సులభసాద్యమగును. ఇంతకీ గీత అంటే :- శ్రీకృష్ణ భగవానుని దూత, వేదవ్యాసుని వ్రాత, వేదమంత్రముల మోత, అహంకారాదుల కోత, దివ్య జ్ఞానమునకు దాత, అసుర స్వభావానికి వాత, దైవీ సంపదకు నేత, పరమార్థ దృష్టికి మాత, రాగద్వేశాలకు మూత, భవసాగరానికి ఈత, ముముక్షువులకు ఊత, దర్మామృతమునకు పోత.

భగవద్గీత మహత్యమును గూర్చి, ఎందరో మహానుభావులు ఎన్నో విధాలుగా తెలియజేశారు. గీతా పారాయణముతో మనో మాలిన్యాలు పోతాయి. తరించదలచిన వారు పంచ ''గకా'' రాలను ఆశ్రయించవలెనని (''గీతా, గంగా, గాయత్రి, గోవింద, గోవు) పెద్దలంటారు. అసలు ''గీ'' అంటే త్యాగము ''త'' తత్వము అనగా త్యాగివై తత్త్వజ్ఞుడివి కావాలని త్యాగం అంటే కర్మలను గాక, ఆకర్మ ఫలాన్ని త్యాగం చేయాలని 'తత్త్వం' అంటే 'ఆత్మ స్పృహ' అని మధుసూదన సరస్వతి వివరించారు.

పేజీలు : 290

Write a review

Note: HTML is not translated!
Bad           Good