పురాణాలు వ్యాసప్రోక్తాలు. అవి మనకు వేరువేరు కథల ద్వారా నీతిబోధ చేస్తాయి. సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో సత్ప్రవర్తనకు ఉపకరించే మార్గదర్శకసూత్రాలను పేర్కొంటాయి. ఆత్మజ్ఞానాన్ని అందిస్తాయి.

ఎప్పుడో జరిగిన గాధలను పురాణాలద్వారా ఇప్పుడు చదవవలసిన అవసరమేమిటన్న వాదం ఒకటి వుంది. ఎందుకు చదవాలంటే, అవి మనలను రుజుమార్గంలో నడిపిస్తాయి కనుక. మంచిపనులు చేసి లోకోపకారం కలిగించి తరించిన మహనీయుల జీవితాలను చదివి ఆకళింపు చేసుకొని సత్కర్మలు చేయడానికి మనమూ ముందడుగు వేస్తాం. చెడుపనులు చేసి పతనమైనవారి కథలు చదివి దుష్కర్మలకు దూరంగా వుంటాం.

పురాణాలన్నీ మనం ఆచరించాల్సిన ధర్మాలను కథారూపంగా వివరిస్తాయి. ధర్మాన్ని ఆచరిస్తే కలిగే ప్రయోజనాలను, ఆచరించకపోతే కలిగే అనర్థాలను తెలియచెబుతాయి. ప్రతీ మనిషి నిష్కామంగా స్వధర్మాచరణ చేయాలని బోధిస్తాయి.

పేజీలు : 209

Write a review

Note: HTML is not translated!
Bad           Good