'వల్లభాంబా పరిణయము'' అక్కెనపల్లి నరసింహ కవి రచించారు. ప్రబంధము అత్యంత రమణీయమైన శైలి, అలంకారాలతో అలరారినట్టి కావ్యము. ప్రసిద్ధి చెందిన ప్రబంధ కవుల కావ్యాలకు ఏ మాత్రము తగ్గని స్ధాయిలో ఉన్నది. తాళపత్రములలోని ఈ కావ్యాన్ని సంశోధించి శుద్ధ ప్రతిని అందించడం నేటి ఎన్నో పరిశోధనలకు విభిన్నమైనది. స్ఫూర్తిదాయకమైనది. అభినందించదగ్గది. స్వామి వినాయకుని వివాహం తెలియపరచే ఈ ప్రబంధ కావ్యము పాఠకుల అభిమానాన్ని చూరగొని ప్రజాదర్ణకు నోచుకోవాలని నా ఆశంస. సుకుమార్‌రెడ్డి సాహిత్యాభిలాషను, కృషిని కొనియాడుతూ అధ్యాపక మిత్రులందరి తరపున, ఆయన మిత్రులందరి ప్రతినిధిగా వినూత్నమైన ఈ ప్రక్రియ మరిన్ని గ్రంథాల ఆవిష్కరణకు దారితీస్తుందని అభిలసిస్తూ..... తమటం రామచంద్రారెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good