శ్రీకరమైన నిషధరాజ్యాన్ని వీరసేనుడనే రాజు పరిపాలిస్తున్న కాలం అది. ఆ నిషధదేశపు యువరాజు నలుడు. శుక్లపక్షపు చంద్రునివలె అనుదిన ప్రవర్ధమానుడయిన నలుడు యువరాజుగా పట్టాభిషిక్తుడయ్యేనాటికి అతని కీర్తి దశదిశలా వ్యాపించింది. అతని కీర్తి వేసంగిలో సూర్యకాంతి పట్టిన గొడుగుకంటే కాంతి వంతంగా భాసించింది. అతని ప్రవర్తన ప్రపపంచ మంతటిలోనూ గల కల్మషాలన్నింటినీ కడిగివేసేటంత పవిత్ర జలధిలా ఉండేది. నలుడు తన భుజబలంతో పదునెనిమిది ద్వీపాలనూ జయించాడు. సకల విద్యలూ, సమస్త కళలూ అతని జిహ్వాగ్రాన నర్తిస్తుండేవి. నిగమాది విద్యలన్నీ దీక్షతో అధ్యయనం చేయడమేగాక, వాటి బోధనలను శిరసావహించి ఆచరించుతూ - సకల విద్యాసారానికి వన్నెదెచ్చేవాడు.

అతడు పరమేశ్వరుని అవతారమని ప్రజలు విశ్వసించేవారు. అందువల్లనే అతనిలో అష్టదిక్పాలుర ఉత్తమ లక్షణాలన్నీ పాదుకొన్నాయి. అయితే...కామసంచార గుణాన్ని జయించే శాస్త్ర విద్యా పారంగతుడు కావడం వల్ల నలుడు అష్టదిక్పాలుర కంటె దొడ్డవాడుగ, ఆ శాస్త్ర విద్యా త్రినేత్రుడుగా పరిగణింపబడేవాడు. అందువల్లనే అతని సామ్రాజ్యంలో దు:ఖాశ్రువులకు చోటు లేకుండా పోయింది. అయితే అతని శత్రురాజుల రాణువల రాణుల కనులనుంచి మాత్రం అధిక వర్షాలు కురిసేవట!...

Write a review

Note: HTML is not translated!
Bad           Good