శ్రీకాళహస్తి మహాత్శ్యం క్షేత్రమహాత్శ్య ప్రబంధం. కాళహస్తి జ్ఞానక్షేత్రం. వసిష్ఠుని మొదలు కీటకం వరకు మోక్షాన్ని కైవసం చేసుకున్న నెలవు, ఇందలి భక్తుల్లో పండిత పామరులైన మానవులేగాక జంతువులు, కీటకాలు కూడా ఉన్నాయి. కృతయుగం నాటి సాలెపురుగు, త్రేతాయుగం నాటి సర్పం, ద్వాపరయుగం నాటి ఏనుగు, కవియుగం నాటి తిన్నడనే ఆటవికుడు, హరిద్విజుడనే బ్రాహ్మణుడు, నత్కీరుడనే కవి, వేశ్యాతనయులు సాయుజ్యం పొందడం కథా వస్తువు. శ్రీకాళహస్తీశ్వర శతకంలో దైవభక్తి, రాజ పండిత నిగర్వణ, భోగపరాన్ముఖత్వం అనే మూడు అంశాలు స్పష్టంగా గోచరించాయి. ధూర్జటి శివాద్వైతి. శివ పారమ్యం నమ్మి, సత్యానికి జీవితాన్ని అంకితం చేసుకున్న వేదాంతి. ఇంద్రియ నిగ్రహం కలిగి అరిషడ్వర్గాలను జయించాల్సిన స్ధితిని గురించి ధూర్జటి 'కాయల్లాచెవధూన ఖాగ్రములచే గాయంబు..' అనే పద్యంలో వివరిస్తాడు. ఆత్మ నివేదనమే భగవత్‌ సాన్నిథ్యాన్ని అందిస్తుందంటాడు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good