రాయలవారు - సమరాంగణ మందెంతయో - సాహిత్యమందు నంతే సార్వభౌములు. అతనికడ నష్టదిగ్గజములను కవులుండిరి. వీరందరు తెలుగు వారేనా? చెప్పలేము. విద్యానగరము పేరు మ్రోసిన కన్నడ, తమిళ కవులను గూడనాదరించినది. తెలుగువారు వారిని ''మీరుదిగ్గజములు గాదు పొమ్మ''ని యెనిమిదిమంది యాంధ్రవులకు మాత్రమే దిక్కులు బంచి యిచ్చినారు. వారెవ్వరెవ్వరనుటలో మరల సందేహములు. మల్లన రాయల కడనుండె ననుటకు ''రాయవాచకము'' ప్రమాణము.

మల్లన్న శృంగారములో 'గవితాపితామహుల' కేమియు దీసిపోనివాడు. 'అవంతిక' పురమును వర్ణించుచు - నాతడు మొట్టమొదటనే 'వారవధూటుల'పైబడినాడు (1-47). కనుక - శృంగారమును వర్ణింపవలసివచ్చినప్పుడు 'పోనిలెమ్మ'ని యుపేక్షించు దృష్టి యతినికి లేదనుట స్పష్టము. కాని - చాలచోటులమాత్రము - ''అనాశ్వాసితదు:ఖితే మనసి'' - యన్నట్లున్నది. దీనికి గారణము - చరిత్ర వక్రించుటయేనని నా యూహ. కృష్ణదేవరాయల కడపటి దినములంతమంచివికావు. అంతవరకును - పతివ్రతవలెయనుసరించుచువచ్చిన విధి - కడపటిదినములలో నాతని వెక్కిరించినది. పుత్రోదయముగాని మెఱమెఱయెక్కటి, తన యనంతరము - సింహాసనము గతియేమి యను బాధ యొక్కటి. యౌవనములో నణగియుండి - క్రమముగా దలనెత్తిన యుదరవ్యాధి యొక్కటి. వీనితో నాతనిమనస్సు సదమదమగుచుండెను.

మనుచరిత్రలోని కడపటి మూడాశ్వాసములు - మొదటివానివలె - రక్తిగా లేవు. దానికి గారణము - పెద్దన్నగారికి జిత్తశాంతి కొఱవడుటయే....

పేజీలు : 384

Write a review

Note: HTML is not translated!
Bad           Good