సాహిత్య విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండడంతోపాటు, సాధారణ పాఠకులు కూడా సంస్కృత కావ్యాలను చదువుకొని, ఆస్వాదించి ఆనందించాలన్న సదాశయంతో సంస్కృత మహాకావ్యాల ప్రచురణను ప్రారంభించాం.
ప్రసిద్ధులైన సంస్కృతాంధ్ర పండితులు రచించిన సరళ వ్యాఖ్యానాలు సంస్కృత మహాకవుల కవితామృత ధారను గ్రోలడానికి పాఠకులకు ఉపకరిస్తాయి.
ఈ సంస్కృత సాహితి తొలి కుసుమంగా మహాకవి భారవి కిరాతార్జునీయ మహాకావ్యాన్ని అందిస్తున్నాం. భారవి అర్థగౌరవాన్ని ఆకళించుకొని, కిరాతార్జునీయ కావ్య రసాస్వాదం చేయవలసిందిగా సహృదయ పాఠకలోకాన్ని ఆహ్వానిస్తున్నాం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good