జ్యోతిశ్సాస్త్రమును జోస్యమని కూడా అందురు. చతుర్వేదములలోని షడంగాల్లో జ్యోతిశ్సాస్త్రము ప్రధానమైనది. ఇది వేదపురుషునకు నేత్రముల వంటిది. దగ్గరగా ఉండే వాటిని మానవ నేత్రాలతో చూడగలిగినట్లే, దూరంగా ఉండే నక్షత్రాలు, గ్రహాలు, వాటి స్థితిగతులు వలన భూమిపైనున్న మానవులపై ఏవిధముగా ప్రభావము ఉంటుందో తెలుసుకోవడానికి జ్యోతిశ్సాస్త్రము నేత్రములవలె తోడ్పడుతుంది.
జ్యోతిస్ + శాస్త్రము = జ్యోతిశ్సాస్త్రము. 'జ్యోతిస్' అనగా వెలుగు లేక జ్యోతి. ఆకాశమందలి నక్షత్రములను, గ్రహములను జ్యోతులందురు. శాస్త్రమనగా ఏదైనా ఒక విషయమును విపులముగా, రూడీగా తెలియజేయునది. కావున నక్షత్రములు, గ్రహములు మానవునిపై వాటి ప్రభావమును గూర్చి తెలుపునది.
సకల మంత్రములలో గాయత్రీ మంత్రము ఎంత విశిష్టమైనదో, అట్లే సకల శాస్త్రములలో జ్యోతిశ్సాస్త్రము అంతే విశిష్టమైనదని చెప్పవచ్చును.
జ్యోతిశ్సాస్త్రము ముఖ్యంగా మూడు భాగములుగా విభజించవచ్చును. అవి 1.సిద్ధాంతము 2.ముహూర్తము 3.జాతకము. వీటికి ఉపభాగములు వంటివే వాస్తు, సాముద్రిక, సంఖ్యా శాస్త్రములు. ప్రాచీన జ్యోతిష గ్రంథములు, వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములు మొదలగువాటి నెన్నింటినో పరిశీలించి ముఖ్యమైన అంశములపై సమగ్ర వివరణ పొందుపరచబడినది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good