కవి అనగానే కాళిదాసు జ్ఞాపకం వస్తాడు ఎవరికైనా. అవును, కవి అంటే అతనే. కవిత్వం అంటే అతనిదే. కవిత్వం అంటే రుచి మరిగేటట్లు చేసినవాడు అతనే. అందుచేతనే కవికుల గురువు కాళిదాసు. అతని కవితాశోభను గురించి ఎవరు వర్ణించి చెప్పగలరు? ఆ పని చేయడంలో కొంతలో కొంత కోలాచల మల్లినాథ సూరికి చెల్లింది. కాని, రమణీయార్ధ ప్రతిపాదకములైన అతని కావ్యాలు వ్యాఖ్యానించడం వివరించడం ఎవరి చేతనవుతుంది. సాహిత్యంలో అంతో, ఇంతో అభినివేశం కల్పించుకోవాలనుకునే ప్రతివాడూ కాళిదాసు కావ్యాలు అధ్యయనం చేయవలసిందే. లేకపోతే అతని సాహిత్య జ్ఞానం మిడిమిడి జ్ఞానం క్రిందనే లెక్క! కాళిదాసు సాక్షాత్తూ సరస్వతి - సందేహం లేదు.

కాళిదాసు నాటకాలన్నీ శృంగారాంగికములు. మేఘ సందేశం శృంగార కావ్యం. ఇది ఒక అపూర్వమూ, అద్భుతమూ అమూల్యమూ అయిన కావ్యరత్నం. దీనిని ఎందరో ఎన్నో విధాలుగా తెనిగించారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good