Rs.30.00
Out Of Stock
-
+
వేద సంస్కృతిలో అంతర్భాగమైన ఆనాటి సత్సంప్రదాయాలు, సంస్కారాలు మరుగున పడిపోతున్న దుస్ధితి పట్టినది ఈనాడు మనకు. ప్రాశ్చాత్యుల విద్యాప్రభావము చేత భావదాస్యము కల్గి సనాతన భావములమీద వ్యతిరేకత ఏర్పడిన ప్రస్తుత కాలమిది. మన సంప్రదాయాలు, ఆచారాలు అర్ధంలేనివని త్రోసిపుచ్చేవారి సంఖ్య ఎక్కువైనది. మన సంస్కృతిలోని అమూల్యమైన విషయాలను మనం మర్చిపోతుంటే..పాశ్చాత్య దేశాలెన్నో మన వేద సంప్రదాయాలను, విశేషాలను గ్రహించి ఆచరిస్తున్నారు. కనుక మన సంస్కృతిలోని సంప్రదాయాలను ఆచరించుట మన ధర్మం. మరుగున పడిపోతున్న ఆ సంప్రదాయాలను ఏరి వరుసగా కూర్చి ఈ గ్రంధములో సమగ్రంగా తెలియజేశారు గ్రంధకర్త గాజుల సత్యనారాయణ. ఈ సంస్కారాలను ఆచరించుట మన ధర్మ ! మన కర్తవ్యం ! మన విధి కూడా !!