స్పార్టకస్‌, టామ్‌ మామ ఇల్లు - స్వేచ్ఛాపధం
పరిచయం : రంగనాయకమ్మ
(3 నవలా పరిచయాల సంపుటం)

1) క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నాటి రోమన్‌ బానిసల తిరుగుబాటును చిత్రించిన నవల స్పార్టకస్‌ - ఇంగ్లీషు మూలం హోవర్డ్‌ ఫాస్ట్‌. తెలుగు అనువాదం - ఆకెళ్ళ కృష్ణమూర్తి. ఈ నవలకు ఇంగ్లీషు పేరుకూడా ఇదే.
2)అమెరికాలో నీగ్రో బానిసల జీవితాలను చిత్రించిన నవల - అంకుల్‌ టామ్స్‌ కేబిన్‌-ఇంగ్లీషు మూలం హారియట్‌ బీషర్‌ స్తోలేవే. తెలుగులో టామ్‌ మామ ఇల్లు.
3)అమెరికాలో నీగ్రో బానిసత్వ నిర్మూలన కోసం జరిగిన 'అంతర్యుద్ధం' తర్వాత పరిస్థితులను చిత్రించిన నవల స్వేచ్ఛా పథం. ఇంగ్లీషు మూలం హోవర్డ్‌ ఫాస్ట్‌. తెలుగు అనువాదం చేసినది అశ్వినీకుమార దత్తు.
ఈ నవలా పరిచయాలు మూడు 'ప్రజాసాహితి' మాస పత్రికలో 1977 ఆగస్టు నుంచి 1979 మే వరకూ ఒక దాని తర్వాత ఒకటి సీరియల్స్‌గా వచ్చాయి.
ఈ మూడు నవలా పరిచయాలూ దాదాపు పాతిక సంవత్సరాల నుంచీ వేరు వేరు పుస్తకాలుగా పునర్ముద్రణలు అవుతూనే వున్నాయి.  ఈ మూడు కథలూ బానిసల పోరాటాలకు సంబంధించినవే. ఇప్పుడు ఈ 3 పుస్తకాలు ఒకే సంపుటంగా కలిసిపోతున్నాయి.

ప్రతి కథకీ సుదీర్ఘమైన 'ముందుమాట' వుంది. అది చదివితేనే ఆ కథకు సంబంధించిన చరిత్ర తెలుస్తుంది. మానవ సమాజం ఎంతెంత నీచమైన, భయంకరమైన దోపిడీ దశల ద్వారా సాగుతూ వచ్చిందో తెలుస్తుంది. ఉత్తర అమెరికా స్వతంత్ర పోరాటం గురించీ, ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఉత్తరాదికీ దక్షిణాదికీ జరిగిన అంతర్యుద్ధం వివరాలు ముందుమాటల్లో తెలుస్తాయి.
ఈ సంపుటిలో రెండు విషయాలు కొత్తవి చేరాయి. మొదటిది 'టామ్‌ మామ ఇల్లు' నవల మీద వ్యతిరేకులు చేసిన దాడి వివరాలు. రెండవది ఈ నవలలు రాసిన రచయితల జీవిత చరిత్రలు క్లుప్తంగా - ఈ పరిచయం చదివినపాఠకులు వెంటనే చెయ్యవలసిన పని మూలరచనని కూడా చదవడం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good