'నువ్వు తీసుకువచ్చిన ఈ ఫోటోలను చూస్తుంటే చనిపోయిన లక్ష్మీప్రసాద్‌ ఎవరోగాని, కాస్తంత కలిగిన కుటుంబంలోంచి వచ్చాడని నాకు అనిపిస్తుంది. ఇవాళ కాకపోయినా, ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు ఆ కుర్రాడిని వెతుక్కుంటూ రావచ్చు. అలా వచ్చినప్పుడు అతన్ని వారికి అప్పగించేయాలి.  అలా చేయకపోవడం చట్టరీత్యా దారుణమైన నేరం అవుతుంది. నేరాలు చేయడానికి అలవాటుపడిన నువ్వు అలా చేయకుండా, మొండిగా ప్రవర్తించి, ఆ పిల్లాడి భవిష్యత్తుని నాశనం చేస్తావేమోనని నా అనుమానం''.
బంధువులు ఎవరైనా వస్తే పిల్లాడిని అప్పగించకుండా తప్పించుకుని, తనమాదిరిగానే జేబుదొంగగా మార్చటం జరగుతుందని చెప్పీ చెప్పకుండా ఆయన చెప్పిన మాటల్ని ఆలకించేసరికి ఉద్రేకం ముంచుకు వచ్చేసింది బాబూలాల్‌కి.
'పిల్లాడి కోసం ఎవరైనా వచ్చిన మరుక్షణం, వాళ్ళను మీ దగ్గరికి తీసుకువచ్చి మీ సమక్షంలోనే అప్పగించేస్తాను సార్‌... అలా ఎవరూ రాని పక్షంలో నా గుండెల్లో పెట్టి పెంచుకుంటాను. నా మాదిరి నికృష్టపు జీవితం గడపాల్సిన అవసరం లేకుండా, చదువు చెప్పించి పెద్దవాడిని చేస్తాను. మా గుడిసె ఎదురుగుండా వున్న భజరంగభలి మీద, నా భార్య మీద ప్రమాణం చేసి చెబుతున్నాను....' అన్నాడు ఆవేశం నిండిన కంఠంతో.
''నువ్వు అంత నిక్కచ్చిగా మాటమీద నిలబడగలిగేటట్లయితే ఆ పిల్లాడి చదువుకు ఎటువంటి సాయం కావాలన్నా నేను చేస్తాను' వెంటనే అన్నాడు యువతి భర్త.
బాబూలాల్‌ తనకు దొరికిన ఆ పిల్లాడిని తన వృత్తిలోకి దించకుండా సక్రమమార్గంలోనే పెంచి అతని రక్త సంబంధీకులకు అప్పగించాడో లేదో మధుబాబు గారి 'స్పందన' నవలలో చదవండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good