శంకర శృకం సాక్షాత్ అని అది శంకర భగవత్పాదులు సాక్షాత్తు శివుని అపరావతారమే అని భావించే భారతీయలు ఎందరో, అది శంకరుల జీవనము అతి విచిత్రమైనది. అయనవంటి అద్భుతమూర్తిని పాశ్చాత్య లోకం ఊహించను కూడా ఊహించలేదు అని పాశ్చాత్య దేశంలో పుట్టి పరిణితి చెందిన విజ్ఞాన ఖని అయిన సోదరి నివేదిత ఆ మహానుభావుని జీవితాన్ని సరిగా మూల్యాంకనం చేసింది. శంకరుని స్తోత్ర గ్రంథాలలో శిఖరాయమానమైన రచన సౌదర్య లహరి . రకరకాలైన బాధలతో క్రుంగిపోతున్నవారు, అర్ధతురులై ఇంద్రియ చాపల్యానికి లోగిపోతున్న వారిని సత్సధంలోని మల్లిచాతానికి శంకరులు ఈ స్తోత్ర గ్రంధం రచన చేశారు. ఇందులో ఆచార్యులు దేవిస్తుతి చేస్తూ వంద శ్లోకాలతో సౌదర్య లహరిని రచించారు. ప్రక్లిప్త శ్లోకాలుగా ఇంకొక మూడు శ్లోకాలు అందులో చేరుకున్నాయి.  

Write a review

Note: HTML is not translated!
Bad           Good