Rs.40.00
In Stock
-
+
ఇది ఒక విశిష్ట పుస్తకం. ఒక ప్రసిద్ధకవి పురిపండా అప్పటస్వామి తెలుగురచనకు మరో ప్రసిద్ధకవి శ్రీశ్రీ ఆంగ్లానువాదం. ఇది వీరిద్దరికీ మంచి స్నేహితుడైన మరోసాహితీవేత్త మొహమద్ ఖాసింఖాన్కు అంకితం. ఇంకా దీనికి శ్రీశ్రీ ముందుమాట రాయడం మరో విశిష్టత.
1926లో శ్రీశ్రీ, వడ్డాది, పురిపండా కలిసి 'కవితాసమితి' అనే సాహిత్యసంస్థను ఏర్పాటు చేసి తొలి ప్రచురణగా శ్రీశ్రీ రచన 'ప్రభవ (1928) కావ్యం వెలువరించారు. దానికి కార్యదర్శిగా పురిపండా అప్పలస్వామి ఉపక్రమణిక రాశారు.
సౌదామిని
ఆ మెరుపుకన్నె నాప్రియురాలు, ఆమె
చంచల దృగంచలముమ్మల ఛాయలందె
నే విహారింతు, ఆమె కెమ్మోవిగాయు
లేతవెన్నెల కొరకె అర్పింతు నా స
మస్త జీవితమ్మును, ఆమె మధురమధు
భాషణమ్ముల కొరకె నే బలవరింతు....
పేజీలు : 47