చాలా పరిమితమైన పరిధిలోనే రచయిత మాలల జీవితానికి సంబంధించిన అనేక కోణాల్ని ఈ నవలలో చర్చకి పెట్టారు. వాళ్ల సామాజిక సంబంధాలు, ఆర్థిక వ్యవస్థ, కుటుంబ బంధాలూ, వాటిపైన అగ్రవర్నాల ఆధిపత్యం ఈ నవలలో కనిపిస్తాయి ముఖ్యంగా స్వాతంత్య్రం వచ్చిన కాలంలో తొలిపాదంలో దళితుల వేదనని అర్థం చేసుకోడానికి ఈ నవల బాగా వుపయోగపడుతుంది. ఇందులో చర్చించిన రాజకీయార్థిక సామాజిక స్థితిగతులు ఎంతమేరకు మారాయో, అవి ఎందుకు మారకుండా వున్నాయో కూడా రచయిత తేటతెల్లం చేశారు. ఆ విధంగా ఈ నవల కేవలం జీవితాన్ని ఆవిష్కరించడానికే పరిమితం కాకుండా, మారని జీవితాల అసలు కోణాల్ని కూడా అన్వేషిస్తుంది.

- అఫ్సర్‌

పేజీలు :167

Write a review

Note: HTML is not translated!
Bad           Good