దేశానికి వెన్నెముక రైతు. దేశ ప్రగతికి మూలధాతువే రైతు అందుకే శేషేంద్ర తన కవిత్వంలో రైతు కష్టాలు కన్నీళ్ళు లోతుగా ఆవిష్కరించాడు. ''నాగలి నా చేతికి నాగుబామయింది/ పొలం పనులు నా కాళ్ళకు సంకెళ్ళుగా మారాయి'' అంటూ వో దార్శినికతా దృశ్యాన్ని పాఠకులకు అందించాడు కవి. ''బాబూ ఈ దేశాన్ని ఈ పొలాల్నీ చూస్తే కన్నీళ్ళు రావడం లేదా? నీ పంల గుండెల్లో బాకులు దింపిన వాళ్ళమీద ద్వేషోద్రేకం రేకెత్తడం లేదా?'' అంటూ వేయిటన్నుల ప్రశ్నలేస్తాడు రైతు లోకానికి. ''చెమట పరిమళాలు ఉమిసే వాళ్ళ పవిత్ర శరీరాలనించి మానవ జ్వాల త్రవ్వితీయరా! ఎడ్ల కళ్ళల్లో కుంపట్లు రాజుకుంటున్నాయ్‌'' చూడమంటూ విప్లవాగ్నిని రాజేస్తాడు రైతుల హృదయాల్లో. ''రైతు నాగలి మోస్తున్నాడు/' క్రీస్తు శిలువ మోస్తున్నట్లు'' అనగలిగిన కవి శేషేంద్ర.

Pages : 69

Write a review

Note: HTML is not translated!
Bad           Good