సొంత ప్రయోజనాన్ని కోరి, వేలకొద్దీ ఆవుల్ని చంపి బ్రాహ్మణులకు యజ్ఞమనే వంకతో సంతర్పణలు పెట్టిన రంతిదేవుడి కాలం ఏ యుగమౌతుంది? కృతయుగం అవుతుందా? కలియుగమౌతుందా? బుర్ర పెట్టుకుని ఆలోచిస్తే బోధపడక మానుతుందా?

తన ప్రజల కోసం రాజ్యాన్ని విడిచి, భార్యాబిడ్డల్ని కాదని, జీవిత సుఖాలను విడనాడి - తిన్న చోట పండక - పండిన చోట తినక - జీవితమంఆ ప్రజలకోసం ధారపోసిన బోధిసత్వుని కాలం ఏ యుగంలో వుండాలి?

సమస్తాన్ని త్యాగం చేసి, ఉన్న సర్వసంపదను సనాతన ధర్మ ప్రచారం కోసం ధారపోసి, అంతటితో తృప్తిపడక, మోహాన్ని విడిచి, భయాన్ని పారదోలి ఆత్మ సమర్పణం గావించిన శ్రద్ధానంద సన్యాసి జీవితం అసూయతో లోకాల్ని చెడదిట్టి శపింపబడ్డ వశిష్టుడి జీవితంకంటే ఉత్తమమైంది కాదా?

పాఠక మహాశయులు నిగ్రహమైన మనస్సుతో ఆలోచించాలి. బాగా ఆలోచించి పరిశీలించాలి. వెనుకా ముందూ పెద్ద పెద్ద బిరుదు తోకల్ని తగిలించుకొన్న వాళ్ళెవళ్ళో సంస్కృత గ్రంథాలు రాశారనీ, వాటిల్లో వున్నదంతా ధర్మమనీ ఎప్పటికీ నమ్మరాదు. నమ్మి భ్రమ, ప్రమాదాలకు లోను కాబోకండి...

సూత పురాణం-2 :

యాదవ ప్రళయం

భారత యుద్దం ముగిసింది. సాయం చేసి యుద్ధంలో గెలిపించాడు గదా - అనే సంతోషంతో పాండవులు కృష్ణుణ్ణి గౌరవించి సన్మానించారు. పాండవుల సమ్మానం పొంది వారి జనాభుడు ద్వారకా నగరానికి బయలుదేరాడు. కొంత దూరం పోయేటప్పటికి సంజ చీకటి కావచ్చింది. అక్కడికి దగ్గరలోనే ఉద్దాలక మహాముని ఆశ్రమం వుందని తెలిసి, ఆ యదు కేశవుడు రాత్రి అక్కడ గడుపుదామని ఆ మున్యాశ్రమానికి చేరుకున్నాడు.

సంతోషించిన ఉద్దాలకుడు ఆశ్రమానికి వచ్చిన కృష్ణుడ్ని గౌరవించి, అతిథి మర్యాదలతో సత్కరించాడు. తరువాత కుతూహలం కలిగి కృష్ణుణ్ణి చూచి -

''సారస దళ నేత్రా! కౌరవ పాండవులకు పగ కలిగింది గదా! అదేమైంది? సంధి అవుతుందని కూడా విన్నా; జరిగిందా? అదెట్టు మారింది? సంధిని నీవే చేస్తున్నావని తెలిసింది; నిజంగా నీవే సంధి చేస్తే అది కాకుండా పోదు; ఎవరూ సంధిని వ్యతిరేకించరు. ఇది ధ్రువం'' అని అడిగాడు.

ఉద్దాలక మహాముని మాటలు విన్న కృష్ణుడు -

''తాపసేంద్రా! మీరన్నది నిజము. దుర్యోధన మహారాజు మొండితనాన్ని ప్రనదర్శించడం వల్ల సంధి కుదరలేదుఎ; సమరమే సంభవించింది. ఆ యుద్ధంలో కౌరవులంతా నేలపాలయ్యారు. విజయ లక్ష్మి ధర్మరాజుని వరించింది. పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం, పద్దెనిమిది రోజులు హోరాహోరీగా పోరు సలిపి అంతా నశించారు. కౌరవుల్లో అశ్వత్థామ - కృతవర్మ - కృపుడు మాత్రం మిగిలారు. పాండవుల పక్షంలో పాండవులైదుగురూ, సాత్యకి - యుయుత్సుడు - నేను బ్రతికాం.

భయంకరమైన ఆ యుద్ధం చూచిన ప్రతివాడికీ కంపం కలిగించింది. అన్నదమ్ములు దాయాభాగం కోసం తన్నుకోగా భరతార్ణవమంతా పీనుగు పెంటలతో నిండిపోయి, చివరకు నిర్మానుష్యమైంది'' అని వచించాడు.

నళినాక్షుడు చెప్పిన మాటలు విని ఉద్దాలకముని కునారిల్లాడు; మండిపడ్డాడు; కటతటాలదిరిపోయాయి మునికి. కోపం కట్టలు తెచ్చుకొని వచ్చింది - సహించలేక -

''కృష్ణా! ఎందుకీ పనికిమాలిన మాటలు చెపుతావు? యుద్ధాన్ని నివారించగలిగి వుండి కూడా నివారించకుండా కౌరవ పక్ష యోధుల నందరినీ అన్యాయంగా ఘోర సంగ్రామం చేయించి చంపించావు. శాప్నాగితో నిన్ను దగ్ధం చేస్తా చూడు. ఇదుగో శాపోదకం; నీ చాలప్యాన్ని భస్మం చేస్తా'' అంటూ కోపంతో కమండలం చేత్తో తీసుకొని పైకెత్తి శాపమీయటానికి సిద్ధమయ్యాడు.

''ఉద్దాలక మహామునీ! ఆగుమాగుము! కోపం దిగమింగు. ముందు కమండలువు అటు పెట్టు; ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు విను; విన్న తరువాత నీకెట్లా తోస్తే అట్లా చేయి. తొందరేమొచ్చింది?....

పేజీలు : 316

Write a review

Note: HTML is not translated!
Bad           Good