గ్రీకు తత్త్వశాస్త్రాన్ని అధ్యయనం చేసే సందర్బంలో ప్రాచీన తత్త్వశాస్త్రం ఆరంభం వికాసాలను తెలుసుకోవడం చాలా అవసరం. ప్రాచీన తత్త్వశాస్త్రం అన్నపుడు ఓ రకంగా ప్రపంచంలో గ్రీకు తత్త్వశాస్త్రం అనే అనచ్చు. దాన్ని సోక్రటీసు పరిపుష్టం చేసాడు.
గ్రీకు తత్త్వశాస్త్ర వేత్తలను అనేక విధాలుగా ప్రభావితం చేసిన వాడు ఆయన. క్రీ.పూ. 469లో జన్మించిన సోక్రటీస్‌ తన భావాలతో ఆనాటి యువకులెందరినో ప్రభావితం చేశాడు. ఎథెన్సు నగరంలో ఉండే వీధుల్లో, సంతల్లో, బజార్లలో, దేవాలయాల్లో - అంతెందుకు ఎక్కడ నలుగురు చేరితే అక్కడల్లా - ముతక బట్టలు కట్టి చేతులెత్తి గంభీరంగా, చమత్కారంగా, హేతబద్దంగా, నిశితంగా మాట్లాడే వ్యక్తి ఎవరని ఎవరిని అడిగినా చెప్పేది అతడు 'సోక్రటీస్‌' అని.
'జీవించడం ఎలాగో, మరణించడం ఎలాగో గొప్ప సత్యాగ్రహి అయిన సోక్రటీస్‌ నుంచి భారతీయులు నేర్చుకోవాలి' అని ఓ సందర్బంలో మహాత్మాగాంధీ అన్నాడంటే, మన యుతరం సోక్రటీస్‌ జీవితాన్ని, బోధనలను గురించి తెలుసుకోవాల్సిందే. తాత్త్విక చర్చల సరళి ఎలా ఉండాలో సోక్రటీస్‌ నుండి నేర్చుకోవలసిందే. ప్రముఖ సాహితీవేత్త శ్రీ నిడమర్తి ఉమారాజేశ్వరరావుగారు రాసిన ఈ పుస్తకం సోక్రటీస్‌ జీవితం - రచనల గురించీ, నాటి గ్రీకుతత్త్వవేత్తలలో అతని స్ధానం గురించీ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good