నేడు ప్రపంచ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, దానికి అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నాయి. 2008లో ఆరంభమయిన ఈ సంక్షోభం నుండి భారీ బెయిలవుట్‌ పథకాల ద్వారా బయటపడుతున్నదని భావించినటప్పటికీ, ఆ ఉపశమనం ఎంతో కాలం నిలవలేదు. మరోసారి ఆర్థిక సంక్షోభం తలెత్తి దాన్ని నుండి బయటపడటం అసాధ్యం అన్న రీతిలో అల్లుకుపోయింది. పెట్టుబడిదారీ సంక్షోభాల పుట్టుపూర్వోత్తరాలను, పర్యవసానాలను సులభంగా అర్థమయ్యేరీతిలో వివరిస్తుంది ఈ చిన్న పుస్తకం. భారతదేశంతో సహా ప్రపంచవ్యాపితంగా పెట్టుబడిదారీ దేశాలలో అమలవుతున్న సరళీకృత, ప్రపంచీకరణ విధానాలనూ ఈ పుస్తకం ద్వారా అర్థం చేసుకోవచ్చు. వర్తమాన ఆర్థికపరిణామాల పట్ల ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.

Pages : 48

Write a review

Note: HTML is not translated!
Bad           Good