''అర్థశాస్త్ర క్రమపరిణామం'' అనే గ్రంథాన్ని ఎ.వి.అనీకిన్‌ అనే ప్రఖ్యాత మార్క్సిస్టు అర్థశాస్త్రవేత్త రాశాడు. పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించే అర్థశాస్త్రంలోని మౌలికాంశాలను చారిత్రకంగా అవగాహన చేసుకోడానికి ఈ పుస్తకం బాగా దోహదపడుతుంది. పెట్టుబడిదారీ విధానాన్ని రక్షించడానికి ఆధునిక అర్థశాస్త్రవేత్తలు కొత్తగా ఏమైనా చెప్తున్నారా? లేక అంతకు ముందు వారి పూర్వీకులు చెప్పిన అంశాలనే పున:శ్చరణ చేస్తున్నారా? అనే అంశాలను తెలుసుకోడానికి ఈ పుస్తకం సహాయ పడుతుంది. అదేవిధంగా గతంలో ఆర్థిక విశ్లేషణలకు అనుసరించిన పద్ధతులను కూడా అవగాహన చేసుకోడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. మార్క్స్‌ పూర్వీకుల అర్థశాస్త్ర ఆలోచనలపై ఈ పుస్తకం దాదాపుగా సమగ్రంగా సమాచారాన్ని పాఠకులకు అందజేస్తుంది.

పేజీలు : 448

Write a review

Note: HTML is not translated!
Bad           Good