సోషలిజం నిర్మాణం ఒక సంక్లిష్ట సుదీర్ఘ ప్రక్రియ. మానవ చరిత్రలో ప్రతి వ్యవస్థా నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలు పడింది. పరిణామ క్రమం ఎప్పుడూ సరళరేఖలా సాగలేదు. పురోగమనం, వంకరటింకర మలుపులు, వెనకంజలు, మళ్ళీ ముందుకు పోవడం చరిత్ర పొడుగునా కనిపించే సత్యం. అభివృద్ధి పట్ల గతి తార్కిక అవగాహన సారాంశమే అది. ఈ ఎగుడు దిగుళ్ళు సోషలిజానికీ వర్తిస్తాయి. |