తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.
    స్నేహప్రియ :
    ఉన్నత ఆశయాలు గల కొత్తగా మెడికో అయిన అమ్మాయి అయిన వారిని వదులుకొని, హితుల శ్రేయోభిలాషుల ప్రియ వచనాలను కాదని, ఓ బలియమైన కారణంతో పల్లెటూర్లో ప్రాక్టీసు పెట్టింది.
    ఆ పల్లెపట్టు జీవిత సరళిలో పెద్దల పట్టుదలలు, కక్షలు కార్పణ్యాలు, ఆమెకి అపాయాలే అయ్యాయి.... ఆ అపాయాల నుంచి ఉపాయంగా ఆమెను ఆదుకున్న, ఓ విచిత్ర యువకునికి ఆమె సన్నిహిత అయింది. ఆ ఆకర్షణతో అనురాగం పెంచుకుంది.
    మరి ఆమె ఆశించిన ఆశయం, ఆమెకు శాపం అయిందా? వరం అయిందా?
    చిక్కటి గ్రామీణ జీవితాల వాస్తవికతకు ఓ చక్కటి ఉదాహరణ స్నేహప్రియ..!
పేజీలు : 150

Write a review

Note: HTML is not translated!
Bad           Good