ఈ పుస్తకం .... ఓ కెలిడో స్కాప్
తెరిస్తే...
ఓ వింత సంత... సీతాకోక చిలుకల్లా ఎగిరే రంగు రంగు ఊహు... గంతు వేసే సరదా సంగతుచిలు... ఓ అద్భుత ప్రపంచం పిల్లల కళ్ళ ముందు...
నడిచి వెళుతున్న అతన్ని ‘‘లిఫ్ట్ప్లీజ్’’ అని ఆ అబ్బాయి ఎందుకు అడిగాడు?
తోటలో దిగిన చందమామ పిట్టతో చెట్లతో ఆడి పాడి చేసిన హడావిడి ఎలా సాగింది?
ఏ పని చేసినా కేవలం ఒక ప్రయోజనంతో సరిపెట్టుకోకుండా రెండు ఉపయోగాలు సాధించడం తెలివైనవాళ్ళ లక్షణం ` అని భావించే ఆ కాకి చేసిన తెలివైన పని ఏమిటి?
గుడ్డి అనుకరణ వల్ల చేటు తెచ్చుకున్న ఆ జామచెట్టు గతి?
ఎన్నో చెట్లకి, పక్షులకి ఆశ్రయం ఇచ్చే ఆ గుట్ట కోరి కోరి రెక్కల్ని తెచ్చుకుని, దాంతోపాటే కష్టాల్ని తెచ్చుకున్న వైనం...
శ్రీను వంకరబుద్ధి ముందు తన వంకర తోక లోపమే కాదనుకున్న పెంపుడు కుక్క రాము స్వగతం...
తనే గొప్పదానినన్న అహంతో చుట్టుపక్క చెట్లతో, పిట్టతో ఏనాడూ సఖ్యంగా లేని ఆ మర్రిచెట్టుకి చివరి క్షణాల్లో కలిగిన జ్ఞానోదయం....
కప్పు కచేరీ చేశాయి... ఎందుకు?
ఇవన్నీ తెలియాంటే ఈ కథల్ని చదవాల్సిందే?
చదివించాల్సిందే !
పేజీలు : 77