తను ఓ మంచి లెన్స్ మన్
తన కళ్ళ కామెరా కందినవన్నీ
మిత్రులతో పంచుకునేవాడు
నిత్యం జరిగే కల్లోలాలకు గాఢంగా స్పందించేవాడు
ఉద్వేగభరితంగా కబుర్లు చెప్పేవాడు
రాను రాను కబుర్లకే పరిమితమై
అనుభవాలన్నీ, అక్షరాలైతే ఎక్కడ ఎవరు
నొచ్చుకుంటారనో కావచ్చు...
రచన విషయంలో అలసతనే ఆశ్రయించాడు
రచనలో మౌనం తను దించుకున్న తెర
ఘర్షణకు తుది రూపమో!