కొన్ని మంచి నవలలు - తాపీగా చదివించి మనల్ని ఆలోచింపజేస్తాయి.
మరికొన్ని మనసును చిందరవందర చేసి, మనకు 'షాక్ ట్రీట్మెంట్' యిచ్చిన అనుభూతి కలుగజేస్తాయి.
''స్మశానం దున్నేరు'' సరిగ్గా యిటువంటి నవలే!

...మనదేశంలో పేదవారికి న్యాయం లభిస్తుందా?
చట్టాలు ఏం చేస్తున్నాయి?
ప్రభుత్వాధికారులు దుర్మార్గులను అణగ ద్రొక్కి సన్మార్గులకు న్యాయం కలిగిస్తున్నారా?
ప్రభుత్వాలు వున్నది ఎందుకు?
ప్రజలను రక్షించడానికా? భక్షించడానికా?
... ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు - ఈ నవల చదివిన తర్వాత మనల్ని కలచివేస్తాయి.
...దోపిడీ వర్గం అభివృద్ధికి కొమ్ముకాసే వెంకటాద్రి వంటి మధ్యతరగతి వ్యక్తులు యెలాంటి పరిణామాన్ని యెదుర్కోవలసి వస్తుందో, తమకు జరిగిన ఘోరాలకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నప్పుడు సంఘటిత శ్రామిక శక్తి ఏవిధంగా విజృంభిస్తుందో అద్భుతంగా చిత్రీకరించిన నవల యిది. శ్రమజీవులకు వాళ్ల హక్కులు, బాధ్యతలు గురించి 'ఎడ్యుకేట్' చేస్తూ, వారిని క్రమశిక్షణాయుతమైన విప్లవపథంవైపు నడిపించే - 'రాజకీయ నాయకత్వం' లేనప్పుడు - ఎలాంటి తీవ్రమైన పరిణామాలు ఏర్పడతాయో పరోక్షంగా నిరూపిస్తున్నది ఈ నవల. (ఆంధ్రజ్యోతి మాసపత్రిక, ఏప్రిల్1980 సమీక్ష నుంచి).
(విశాలాంధ్ర పత్రిక నిర్వహించిన పోటీలో (1980) ద్వితీయ బహుమతి పొందిన నవల ఇది)

Write a review

Note: HTML is not translated!
Bad           Good