నా దైనందిన జీవితంలో ఉపయోగపడడం ద్వారా ఈ పుస్తకం తన ప్రభావాన్ని ప్రస్ఫూటంగా ప్రతిబింబిస్తోంది. నా దగ్గర సుమారు 100 సౌకర్యాలతో కూడి ఐ ఫోన్ ఉంది. కానీ వాటిలో పట్టుమని పదింటిని కూడా వాడడం లేదు.
సమయాభావం వలన కొంత ప్రయత్నించినప్పటికీ వాటిని ఉపయోగించి ప్రయోజనం పొందడం తెలీక కొంత, ఇదే కాదు 1996 లో మొదటి మొబైల్ పొందినప్పటి నుండీ ఇప్పటి వరకూ డజనుకి పైగా ఫోన్ల విషయంలో ఇలాగే జరిగింది.
ఈ పుస్తకం, ఇలాంటి అసౌకర్యాన్ని తొలగిస్తూ, ప్రతీ అవసరాన్నీ నిర్ణీత పద్థతుల ద్వారా, ఒక్కటొక్కటిగా, సులభంఆ అర్థమయ్యేలా పరిష్కరించుకోవడాన్ని సూచిస్తుంది. అంతగా సాంకేతిక పరిజ్ఞానం లేని వారికి సైతం ఉపయోగపడే పుస్తకం ఇది.
నిజానికి ప్రతి రోజూ నాకు వందల సంఖ్యలో ఇ-మెయిల్స్ వస్తుంటాయ్. ఫిల్టర్లను దాటుకుంటూ వచ్చిన వాటిలో చాలా వరకూ స్పామ్ (పనికి రానివే) మెయిల్సే. వీటిని వెంటనే తొలగిస్తాను. కొన్ని మెయిల్స్‌కి నేను వెంటనే సమాధానమిస్తాను. అప్పటికీ ప్రతి రోజూ నేను తరువాత సమాధానం ఇవ్వాల్సిన మెయిల్స్ మిగిలే ఉంటాయి. నేను తరువాత నిదానంగా జవాబు ఇవ్వవచ్చు అనుకుంటూ మరచి పోతుంటాను.
వాటిని పంపిన వారు సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇ-మెయిల్స్‌ను మనం అనుకున్న సమయానికీ పంపించగలిగేట్టు ముందుగానే నిర్ధేశించుకోగలిగే ''భూమ్ రాంగ్'' పద్ధతిని నేర్చుకోవడం నా విధానాన్ని పూర్తిగా మార్చి వేసింది.
తరువాత పంపాల్సిన మెయిల్స్‌ను ముందుగానే రూపొందించుకొని సమయాన్ని, తేదీని నిర్థారించుకునే సౌకర్యం తెల్సుకోవడం వలన నాకు చాలా సమయం కలిసొస్తుంది. విమానయానంలోనే వాణిజ్యపరమైన, వ్యక్తిగతమైన సందేశాలు, పుట్టిన రోజు శుభాకాంక్షలతో సహా, మిత్రులకూ సన్నిహితులకీ పంపించాల్సిన మెయిల్స్ ముందుగానే సిద్ధం చేసి, తేదీ సమయంను అవసరమైనట్లుగా నిర్దేశించుకోవడం వలన నాకు చాలా సమయం కలిసొచ్చింది. ఈ పుస్తకంలో ఇంకా సమయాన్ని, పొదుపు చేసుకోగలిగే సలహాలు, సూచనలు ఇటువంటివి చాలా ఉన్నాయి.
- సంజీవ్ బిక్సాందినీ
వ్యవస్థాపక, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు
నౌకరీ.కామ్