''నీలకంఠుని శిరసున నీళ్ళుచల్లి,

పత్తిరిసుమంతనెవ్వడు పారవైచు,

కామధేనువు వాడింటి గాడిపసర,

మల్ల సురశాఖి వానింటి మల్లె చెట్టు.''

 శివ అష్టోత్తర శతనామస్తోత్రం చాలా విశేషమైన స్తోత్రం. స్కాందపురాణంలో నారాయణుడు పార్వతీదేవికి ఉపదేశం చేసాడు. పరమశివునికి 63 లీలా మూర్తులు ఉన్నాయి. ఆ లీలామూర్తులలో పదమూడవ మూర్తిని హరిహరమూర్తి అంటారు. శ్రీ మన్నారాయణుడు శివుని శరీరంలో సగభాగాన్ని పొందుతాడు. భేదం లేని రీతిలో శివకేశవులు కంసారి, కాలారీ ఇద్దరు ఒకే స్వరూపంగా ఉన్నవారు. అలా ఉన్న స్వరూపాన్ని హరిహరమూర్తి అని పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారంటే దేనికది విడివడి ఉంటే గౌరవం లేదు. అది శాస్త్రం వైదికం కాదు. అనేకములుగా ఉన్నవి ఒకే సృష్టిలోనికి పర్యవసించి పోవడం సృష్టిలోని రహస్యం. సృష్టి ఒకటిగా, రెండుగా, మూడుగా, నాలుగుగా ఉండిపోతే అర్థం లేదు ఒకటిలోకి వెళ్ళిపోవాలి.

Pages : 168

Write a review

Note: HTML is not translated!
Bad           Good