Rs.75.00
In Stock
-
+
"ఈ ప్రపంచంలో మగవాలందరి లోకి నిక్రిష్ణుడైన మగవాడేవరో తెలుసా ? తను ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకోలేనివాడు ! పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమించ లేనివాడు! ఈ రెండు మీరు చేశారు. దీనికి తగినట్టు మీరు తప్పకుండా అనుభవిస్తారు " అని శాపనార్ధాలూ పెడుతుంది.
" ఆ సీతని నేను పెళ్లి చేసుకున్నానే గాని ఏలాంటి సంబంధమూ యింతవరకూ లేద.నేను ఆ అమ్మాయిని వదిలేయటంలో తప్పేం లేదు. మనం దూరంగా వెళ్ళిపోదాం. ఒక చిన్న ఇల్లు చూసుకుందా... - అంటాడు. ఇందిరతో విద్యాపతి.
" తను ఎంత ఘోరం చేయబోయింది. విద్యాపతిని తనతో వచ్చేయమంది. సీత గతేమిటి? అసలు ఇందులో సీత తప్పేం వుంది? విద్యాపతిని సీత అమాయకంగా - అందరు తల్లిదండ్రులు కుదిర్చిన సంబందం లాగానే చేసుకుంది. .. సీతని ఒప్పించి విద్యాపతిని రాగలిగితే బావుంటుంది. కానీ అది సాధ్యమా?" ఇది ఇందిరా విచికిత్స.
ఈ ముగ్గురూ అంతస్సంఘర్షణకు అడ్డం పతీ నవలే సీతాపతి. " జీవితం అంటే స్వసుఖా పేక్ష కాదు - కర్తవ్య పాలన " అన్న ఉదాత్త సూత్రాని ప్రతిపాదించే యద్దనపూడి సులోచనారాణి నవల యిది .