వ్యధలోంచి, బాధలోంచీ సేవా కార్యక్రమాలు పుడతాయా? తన సోదరిపడే నరకయాతన చూడలేక, కాన్సర్‌ దారల్లో ఇరుక్కుని ఎందరు స్త్రీలు విపరీతమైన బాధకు లోనవుతున్నారో అన్న హృదయస్పందనతో డాక్టరు ముత్తు లక్ష్మిరెడ్డి ప్రత్యేకంగా  ఈ వ్యాధి చికిత్స కోసం దక్షిణాదిన కాన్సర్‌ హాస్పటల్‌ నెలకొల్పటానికి అంకురార్పణ చేశారు. తన బాధ నుంచి ఇతరుల బాధని చూడగలిగినపుడు, ప్రతి మనిషీ తన స్వల్ప పరిధి నుంచి ఎదిగి మానవతామూర్తి అవుతున్నాడు.
అందం, విద్య, తెలివి, వివేకం, ప్రేమించే తల్లిదండ్రులు అన్నీ వున్న సంధ్యకు - కాన్సర్‌ వ్యాధి వచ్చింది అన్నపుడు - ''నాకెందుకీ జబ్బు రావాలి? నాకే ఎందుకీ శిక్ష?'' అని ప్రశ్నించుకుంటుంది. ఇరవై నాలుగేళ్ళ సంధ్య జీవితంలో కాన్సర్‌ రూపంలో శివిరం ప్రవేశిస్తుంది. ప్రేమ, పెళ్ళి, సంసారం, మాతృత్వం ఇవేమీ రుచిచూడకుండానే, కాన్సర్‌ తనని కబళింప చూస్తున్నప్పుడు, ధైర్యంతో విపరీతమైన ఏకాగ్రత్తతో పోరాడి గెలిచిన సంధ్య, స్త్రీ సహజమైన వైవాహిక జీవితాన్ని, మాతృత్వాన్ని కూడా పొందగలుగుతుంది. సంధ్య జీవితం నవయువతి పోరాటమే కాన్సర్‌ రోగులు పాలిట ఆశాదీపం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good