Rs.51.00
In Stock
-
+
చిరు (సిరి) ధాన్యాల వంటశాల
ఏ పెద్ద వంటకం తీసుకున్నా... బియ్యం పిండి, గోధుమ పిండి, లేదంటే శెనగ పిండి... వీటికి తోడు బోలెడంత నూనె లేదా నెయ్యి లేదా డాల్డా! ఇవి తప్పించి, మరో రకం కనబడదు. ఇవి రుచిగా ఉండే మాట నిజమేగానీ... వీటితో ఆరోగ్యానికి మేలేనా? నిజం చెప్పాలంటే ఇవే వంటకాలను ఇంతకంటే ఆరోగ్యకరంగా వండుకోవచ్చు! ఇంతకంటే మెరుగైన పోషకాలు లభ్యమయ్యేలానూ వండుకోవచ్చు! బియ్యం, గోధుమ, శెనగ కాకుండా... జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్ర వంటి చిరుధాన్యాలతో వండుకోవటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రత్యేక వంటకాలనే కాదు... రోజువారీ మనం తినే ఇడ్లీ, దోశల నుంచి చిరుతిళ్ళుగా తీసుకునే మురుకులు, బిస్కట్లు వరకూ అన్నింటినీ చిరుధాన్యాలతో మరింత ఆరోగ్యకరంగా వండుకునే అవకాశం ఉంది.
పేజీలు : 72