''సింగరాజు లింగమూర్తిగారు రచించిన ఈ సంపుటిలో చోటుచేసుకున్న ఇంచుమించు అన్ని కథలు మధ్యతరగతి కుటుంబాల్లో జరిగే ఉదంతాలకు సంబంధించినవే. ఎక్కువ కథలు విషాదాంతాలుగా ముగియటం గమనార్హం. ఆ కథల్ని చెప్పిన పద్ధతిలో స్పష్టత, సూటితనం కనిపిస్తాయి. ఎక్కువ కథల్ని రచయితే చెప్పినట్టుగా... అంటే రచయిత సర్వసాయిదృష్టికోణం నుండే చిత్రించినట్టుగా అర్థమవుతుంది. కొన్ని కథల్ని ఆయన కథలోని ఒక పాత్రే ఉత్తమపురుష ''నేనూ'' అంటూ చెప్పటం కూడా జరిగింది. యే కథను కూడా ప్రతీకాత్మకంగా చెప్పాలనిగాని, ప్రయోగాత్మకంగా చెప్పాలని కానీ ఆయన ప్రయత్నించలేదు. ఆయన కథల్లోని పాత్రల్ని చూస్తే వాళ్ళంతా మన సమాజంలో మన చుట్టూ తిరుగుతున్న వాళ్ళలాగే కనిపిస్తారు. వాళ్ళ మనస్తత్వాలలోని బలాన్ని, బలహీనతల్ని ఆయన ఎతో వాస్తవికంగా చిత్రించారు.'' - అంపశయ్య నవీన్‌

పేజీలు :270

Write a review

Note: HTML is not translated!
Bad           Good