కథకులు రెండు రకాలుగా వుంటారు. నిర్దిష్ట ప్రాంతంలోని మాండలికాల్ని, జీవితాల్ని, కష్టసుఖాల్ని, ఆచార వ్యవహారాల్ని యథాతథంగా అద్భుతమైన శైలిలో కథల్ని రాసేవారు ఒక రకమైతే, అలాంటి కథల్ని రాస్తూ జీవితాలు అలాగే ఎందుకున్నాయో, ఎలా వుంటే బాగుంటుందో చెప్పే వాళ్ళు మరొక రకం! పై రెండు రకాల కథకుల్లో ఆ కథల రచయిత ఏ రకం వాడో కథలన్నీ చదివితే మీకే అర్థమవుతుంది. - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

సాదాజీవన శైలినీ, సంపద్వంతమైన ఆత్మిక ప్రపంచాన్ని, సంతోషదాయకమైన మానవ సంబంధాలను సింగమనేని కథలు ప్రతిపాదిస్తాయి. మానవీయ విలువల్లో జీవన సార్థకతను అన్వేషిస్తారు ఆయన. - జీవితం పట్ల అపారమైన ప్రేమ ఆయన తాత్విక ప్రతీక... అందుకే ఆయన అన్యాయం, అసత్యం, డాంబికం, అల్పత్వాలను ద్వేషిస్తారు. ఆయన కథలు ఆయన జీవన తాత్వికతకు సాహిత్యదర్పణాలు. - డా|| బి.సూర్యసాగర్‌

పేజీలు : 174

Write a review

Note: HTML is not translated!
Bad           Good