సింగమనేని వస్తుపరంగానే కాక రూప పరంగా కూడ వాస్తవికతా వాది. కథా శిల్పంలో ఆయన వాస్తవికతకు భంగం కలిగించే ప్రయోగాలకు పూనుకోలేదు. సంభాషణల్లో అనంతపురం జిల్లా స్థానిక భాషా మాధుర్యాన్ని చవిచూపించారు. విస్తృత వర్ణనల జోలికి పోకుండా క్లుప్తతను సాధించి, పాత్ర చిత్రణలో సజీవతను సాధించారు. కథంలో అనవసరమైన సంఘర్షణలను కల్పించకుండా, కథ తనంతట తాను నడిచే అవకాశం కల్పించారు. సింగమనేని కథల్లోని పాత్రలు మన సమాజంలో నిరంతరం కనిపించే వ్యక్తుల సమూహాలకు నమూనాలే.
- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
రచయితకు జీవితము, సాహిత్యము రెండు తెలిసుండాలి. అంతే ముఖ్యంగా వాటి మధ్యగల సంబంధ బాంధవ్యాలూ తెలిసుండాలి. అప్పుడే ఉత్తమ సాహిత్య సృజన సాధ్యమవుతుంది. సింగమనేని కథా సాహిత్యం ఆ విధంగా సృజింపబడినదే. ''నాకు కథా రచన సహజంగా అబ్బలేదు, గట్టిగా సాధన చేసి నేర్చుకున్నాను'' అని సింగమనేని అంటారు. ఆయన కథలు చాలా సహజంగా ఆవిష్కారం కావడనికి కారణం ఆ సాధనే. ఆయన ప్రతిభావంతుడైన జీవిత పరిశీలకుడు. జీవితం క్షుణ్ణంగా తెలిసిన ఆత్మవిశ్వాసంతో మానవ జీవితాన్ని సున్నితంగా స్పృశించడం ఆయన కథలలో అనుభూతమవుతుంది. ఆయన కథలు జీవిత సాక్షాత్కారంగా ఉంటూ పదే పదే గుర్తుకొస్తాయి.
- బి. సూర్యసాగర్
భాష విషయంలో సింగమనేని నారాయణది మధ్యేమార్గం. మాండలికాన్ని సంభాషణలకు మాత్రమే ఉపయోగించి కథకూ, కథనానికీ మధ్య ఉండవలసిన తేడాను జాగ్రత్తగా పాటించాడు. సింగమనేని రచయితగా మాత్రమే కాకుండా తన సహచర్యంతో, ఆలోచనాపరుడుగా, లిటరరీమీట్, అనంత రచయితల సంఘం బాధ్యుడుగా , సంపాదకుడుగా - ఆ ప్రాంత రచయితల వస్తు శిల్పాలను ప్రభావితం చేశాడు.
- వల్లంపాటి వెంకట సుబ్బయ్య

Write a review

Note: HTML is not translated!
Bad           Good