ఎన్ని మార్పులు వచ్చినా, మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.

శిక్ష అంటే జడ్జీలు వేసే శిక్షకాదు.

తప్పులు చేస్తే పైనున్న దేవుడు వేసేది కనిపించే శిక్షకాదు.

జీవితంలో ఆస్తులు, అంతస్థులు, బాంధవ్యాలు మధ్య ఇతరులకు యిబ్బంది కలిగించకుండా వుండటం కోసం ఇష్టంలేని పెళ్ళిళ్ళకు తలవంచడంకూడా ఒక రకం శిక్ష !

కుటుంబాలలో పన్నీరొకవైపు, కన్నీరొకవైపు ప్రవహిస్తే అందరి మంచికోసం తలవంచటం మరోరకం శిక్ష !

శశికి ఎదురైందో అవమానకరమైన శిక్ష ! ఏమిటది?

విస్తృతమైన నవలా సాహిత్యానికి నూతనత్వం ఆపాదిస్తూ నిత్య జీవితంలో తారసపడే అనేకానేక అనివార్య సంగటనలనూ, సంఘర్షణలనూ ప్రతిభావంతంగా చిత్రించిన అసమాన రచయిత్రి మాదిరెడ్డి సులోచన మహోత్కృష్ట నవల యిది!

Pages : 204


Write a review

Note: HTML is not translated!
Bad           Good