పురాణ వాజ్మయము పరమార్ధ దృష్టి ప్రధానమైన భారతీయ ధర్మ ద్రుష్టి కి ఆలంబనము. బహిక ఆముష్మిక సుఖాలలో, సంపన్నులుగా చేసే ధర్మాలను ప్రతిపాదించటంలో శ్రుతు (వేదము)లలో బాటు పురాణాలను ప్రామాణ్యం ఉన్నది. బడరికారణ్యంలో గల ప్రాచీన విద్యాపీటానికి కులపతి అయిన వేదవ్యాసుడు అష్టాదశ పురాణాలలోను  ఉపపురాణాలను శిష్యులకు బోధించాడు. ఆ అష్టాదశ పురాణాలలోను శ్రీ విష్ణు మహాపురాణం మూడవది. పురాణ పురుషుని యొక్క కుడి భుజంతో పోల్చబడినది. ఈ పురాణం. విష్ణుపురాణం ప్రసక్తి యజుర్వేదంలో కనిపిస్తున్నది. అంటే వేదకాలం నాటికే ఈ పురాణం వర్ధిల్లింది అని భావించవచ్చు. శ్రీ విష్ణు మహాపురాణం ఆరు అంశాలు తో ఆరువేల నాలుగు వందల పన్నెండు శ్లోకాలలో చెప్పబడిన, విష్ణు మహత్మ్య ప్రతిపాదకమైన విశిష్టపురాణం , శ్రీ విష్ణు ప్రాధమ్యాన్ని , విషు భక్తీ స్వరూప వైవిధ్యాన్ని దాని వైశిష్ట్యన్ని ప్రతిపాదించేది ఈ పురాణం , త్రిమత ప్రస్థాన ఆచార్యలు శ్రీ ఆదిశంకరులు, శ్రీ రామానుజాచార్యులు , శ్రీ మాదనంద , తీర్డులు తమ తమ భాష్యాది రచనలలో ఈ పురాణాన్ని ప్రామాణికంగా గ్రహించటమే దీని ప్రాముఖ్యాన్ని, ప్రాశాస్యాన్ని తెలుపుతుంది. ఇంతే కాకుండా ఎన్నో స్రుతి గ్రంధాలలోను,వ్యాఖ్యా గ్రంధాలలోను ఈ పురాణంలోని శ్లోకాలు ప్రామాణికంగా ఉదహరించబడ్డాయి. ప్రక్రుతి , పురుషుడు మొదలైన 24 తత్వాలు , జగదుత్పతి .కాలస్వరూపం, వివిధ అవతారాలు, నగరం, గ్రామం, మొదలైన పేర్లతో భూమి విభజన, ద్రువుని వృత్తాంతం , హిరణ్యాక్షవధ మొదలైన వృత్తాంతాలే గాక పురాణ పంచ లక్షణాలు దీనిలో సామ్యగ్రూపంలో వర్ణించ బడ్డాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good