భారతీయ ధార్మిక విషయాలన్నీ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు మొదలైన వానిలో సంపూర్ణంగా ప్రతిఫలిస్తున్నాయి.భారతీయ ధర్మమే మానవ ధర్మము లేక సనాతన ధర్మము అని పిలువబడుతుంది . ఈ ధర్మము వైదిక జీవన విధానం మీద ఆధార పడి ఉన్నది. ప్రజాపతి బ్రహ్మ కు వేదం కంటే ముందే స్మరణకు వచ్చిన శబ్దములే అనాదిగా వచ్చిన అపౌరుషేయ పురాణాలు. దీనినే వ్యాసుడు 18 భాగాలుగా విభజన చేసి వానికి పౌరుషేయ రూపాన్ని ఇచ్చాడు. భారతీయ జీవన విధానము , భక్తీ మార్గం లేక కర్మ యోగం మొదలైన వాని చక్కని సమన్వయం అష్టాదశ సంఖ్య గల ఈ పురాణాలలోనే లభిస్తుంది. ఇలాంటి అనేక విషయాల చేత పరిపుష్టమైన పురాణాలలో ఏమి ఉన్నదో తెలుసుకోవడం విద్యావంతులైన వారి అందరి కర్తవ్యం. విష్ణు అవతార పురాణాలలో నాల్గోవది 'వ' చతుష్టయం లో కూడా నాల్గవది అయిన 'వరాహపురాణం' వెలువడుతున్నది. |