భారతీయ సంకృతి , నాగరికత, చరిత్రలను గురించిన సంపూర్ణ జ్ఞానం కోసం, పురాణ అధ్యయనం తప్పనిసరి. పురాణాలు ఈ ప్రాచీన దేశపు సంకృతి, ఆచార వ్యవహారాలు, నాగరికత, చరిత్రలను గురించి తెలిపే కొలదండాలు, వీటిని క్షుణంగా తెలుసుకొనని ఎటువంటి అధ్యయనమైనా, భారతదేశానికి సంబంధించినంత వరకు అసంపూర్ణమే. కృష్ణ ద్వైపాయన వేదవ్యాస మహర్షి కృతమైన భారతీయ పురాణ సాహిత్యం అంటే అష్టాదశ (18) మహాపురాణాలు, ఉపపురాణాలు, ఔపపురాణాలు గల మొత్తం సాహిత్యం, అష్టాదశ మహాపురాణాలలోను 14 వ పురాణం శ్రీ వామన మహాపురాణం . సుమారు 6000 పైగా శ్లోకాలు గల ఈ పురాణం, పురాణాలలో అతి చిన్నది. అయినా ఇందులో అనేక ప్రత్యక విషయాలు వివరించ బడ్డాయి. చక్కని కావ్య శైలిలో వివరించ బడిన పార్వతి కళ్యాణం , వామనావతారం గురించిన సవివర విశేషాలు భువనకోశం , దేవి మహత్యం , దేవాసుర యుద్దాలు, కురుక్షేత్రం అందులోని తీర్దాలు, అనేక వ్రతాలు, స్తోత్రాలు, అభ్యాసాలు, ఉపాభ్యాసాలు, మొదలిఐన్ పౌరాణికి అవిశేశాలను తెలియజేసే పురాణం ఈ శ్రీ వామన్ మహాపురాణం.  ధర్మ , అర్ధ , కామ, మోక్ష, ప్రతిపాదకమైన ఈ పురాణం ఇప్పుడు తేట తెలుగు వచనంలోని తీసుకొని రాబడింది సుమారు 100 పేజీలకు పైగా పురాణాలను గురించిన అనేక విషయాలు, ప్రత్యేకంగా వామన పురాణాన్ని గురించిన విపుల పీఠిక తో గల ఈ పురాణం తెలుగువారి ప్రతి ఇంటిని అలరించాలని మా ఆకాంక్ష.

Write a review

Note: HTML is not translated!
Bad           Good