కృష్ణద్వైపాయనకృత అష్టాదశ మహాపురాణాలలో శ్రీ స్కాంద మహాపురాణం పదమూడవది. 81100 శ్లోకాలు గల ఈ పురాణం అన్ని మహాపురాణాలు కంటే బృహత్కాయం కలది. నేడు సప్త ఖండాత్మకమైన స్కాందపురాణం ఒకటి. ఆరు సంహితలుగా ఉన్న స్కాంద మహాపురాణం ఒకటి రెండూ వేర్వ్ వేరు గా స్కాందపురాణం లభ్యమవుతుంది. ఇవికాక స్కాందపురాణం లోనివిగా చెప్పబడే అనేక ఖండాలు, సంహితలు, మహత్యాలు విడివిడిగా రెండు వందలకు పైగా ఉన్నాయి. వీటి అన్నింటిని కలుపుకొంటే స్కాందపురాణం పరిమితి నాలుగు లక్షలు శ్లోకాలను దాటిపోతుంది.భాగవంతుడైన మహేశ్వరునిచేత పార్వతికి చెప్పబడిన ఈ పురాణం పార్వతి నున్హి స్కందుడు అనబడే కుమారా స్వామికి చేరింది. అందుకే ఇది స్కందని పురాణం కాబట్టి స్కందపురాణం అయింది. దీనికే స్కాందపురాణం అని కూడా పిలుస్తారు . ఆసేతు శీతాచలంలో గల అనేక క్షేత్రాలు తీర్దాల, మహాత్మ్యలను స్థల వేశేషాలను ప్రత్యేకంగా వివరించే పురాణం ఇది. తత్పురుష కల్పం లో జరిగిన వృత్తాంతాలను తలపు అనేక చరిత్రలు ఉపాఖ్యానాలు , మహేశ్వర ధరములు వివరించుట కొరకు షణ్ముఖుని చేత ప్రకాసిమ్పబడిన పురాణ ఇది. ధర్మ శాస్త్ర గ్రంధ కర్తలు, స్కృతి కారులు తమ గ్రంథాలలో స్కాందపురాణం నుంచి అనేక శ్లోకాలను ఉద్దరించారు. అందువలన ఇది ప్రామాణిక మైన పురాణాలలో ఒకటి గా పరిగణింపబడుతున్నది. దీనిలో అనేక వైదిక మంత్రాలు, సూక్తాలు, ఉదాహరించబడ్డాయి.
Rs.500.00
Out Of Stock
-
+