శ్రీ స్వామి వారి ఆదేశం ప్రకారం దశమహావిద్యలు అనే పేరుతొ పది దేవతలకు సంబంధించి పది పుస్తకాలు వెలువరించాలని ఒక ప్రణాళిక రూపొందించుకున్నాను. ఆ ప్రణాళికలో భాగంగా మూడోవ గ్రంధమైన శ్రీ షోడశీ సాధన  అనే ఈ పుస్తకం ద్వారా , శ్రీషోడశీ దేవి  దేవి గురించి, వివిధ రకాలైన శ్రీ షోడశీ దేవి  మంత్రాలు గురించి, వాటి సాధనా పద్దతుల గురించి,శ్రీ షోడశీదేవి  అష్టోత్తర, సహస్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంధాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకలనంగా రూపొందించి మీ కందిస్తున్నారు.ఈ సంకలనంలో సాధనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని వీలైనంత సమగ్రంగా ఇచ్చే ప్రయత్నం చేసారు. మరిన్ని వివరాలు కావాలనుకునే సాధకులు మంత్రం మహార్ణవం , మంత్రం మహోదధి, శారదా తిలకం గ్రంధాలను పరిశీలించవచ్చు
అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీ షోడశీదేవి దశమహావిద్యాలలో మూడవ మహావిద్యగా ప్రసిద్ది పొందింది. పరమశాంతి స్వరూపిణి అయిన ఈ మహావిద్యకు మార్గశిరమాస పూర్ణి మాతిది ప్రీతి పాత్రమైనది. ఈ తల్లి నే లలితా అని, రాజ రాజేశ్వరి అని, మహాత్రిపుర సుందరి అని అంటారు. ఏంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్ట నష్టాలనుంచి విముక్తి, మానసిక శాంతి, భోగం, మోక్షం కలుగుతుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good